![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం వీకెండ్ వచ్చేసింది. గత రెండు రోజుల నుండి హాట్ టాపిక్ ఏదంటే.. సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ అని, తను హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని అన్నారు. మొదట సీక్రెట్ రూమ్ అన్నారు.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉహించుకున్నారు. కానీ నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రావడంతోనే సంజన స్టేజ్ పైకి వచ్చేసింది. ఇక తను స్టేజ్ మీదకి వచ్చి.. నేను ఎలిమినేట్ అయ్యేంత ఏం తప్పు చేశానని ఎమోషనల్ అవుతుంది.
ఈ స్టేజ్ వదిలి వెళ్లే ముందు నీ హౌస్ మేట్స్ తో మాట్లాడుదామని నాగార్జున అంటాడు. మన టీవీలో అందరిని సంజన చూస్తుంది. అందరి గురించి చెప్పమని నాగర్జున అంటాడు. ఎవరు ఏది మార్చుకోవాలో ఒక్క మాటలో చెప్పమని సంజనని అడుగుతాడు. దాంతో సంజన అందరి గురించి చెప్తుంది. సుమన్ అన్న కన్పించడం లేదు.. దేనికి స్టాండ్ తీసుకోరు అని సంజన చెప్తుంది. ఇక రాము పై సంజన సీరియస్ అవుతుంది. ఏంట్రా నేను అందరిని చిన్నస్థాయి, పెద్దస్థాయి అని చూస్తానా.. నేను ఎవరినైనా అలా చూసానా.. హరీష్ గారితో ఏదో అంటున్నావ్ చీప్ గా బెహేవ్ చేస్తానని సంజన అనగానే.. నేను అనలేదని రాము అంటాటు. రికార్డు ఉందని సంజన చెప్తుంది.
ఇక హరీష్ గారు నాలుగు రోజుల నుండి ఒకే డ్రెస్ పై ఉన్నారు. హైజీన్ గా లేరని సంజన అంటుంది. తనతో ఏదైనా చెప్దాం అన్నా కూడా అందరు భయపడుతున్నారు. ఏమని చెప్పమంటారు సర్ మా బాధ అని సంజన అంటుంది. ఇక ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు. తనతో ఉంటే మా అమ్మతో ఉన్నట్లే ఉంటుంది సర్ ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. ఇక సంజన అందరికి బై చెప్పి వెళ్లిపోతుంటే.. సంజన ఒక్క నిమిషం అని నాగార్జున వెనక్కి పిలుస్తాడు.
![]() |
![]() |